Rs. 1000 crore | విమర్శలకు బెదిరేది లేదు…
- ప్రజా సహకారంతో రామగుండం అభివృద్ధి
- రెండేళ్లలో 1000 కోట్లతో అభివృద్ధి పనులు
- ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్
- గోదావరిఖనిలో అభినందన సభ
Rs. 1000 crore | గోదావరిఖని, ఆంధ్రప్రభ : విమర్శలు… ఆరోపణలకు బెదిరేది లేదని… దశాబ్దాలుగా ఊహించని అభివృద్ధి… రామగుండం నియోజకవర్గం లో గడిచిన రెండు సంవత్సరాల కాలంలో రూ. 1000 కోట్ల(Rs. 1000 crore) నిధులతో అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు సాగుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్(MLA Makkansingh Raj Thakur) స్పష్టం చేశారు.
ఈ రోజు రాత్రి రెండు సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్ల విస్తరణ పనులు దూసుకుపోతున్నాయి అన్నారు.
నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో… వారి సహకారంతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నానని చెప్పారు. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్(Educational Hub)గా , మెడికల్ హబ్బుగా తీర్చిదిద్దడం తన ప్రధాన కర్తవ్యం అని తెలిపారు. రామగుండం పట్టణంలో 800 మెగా పట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సుము కథ వ్యక్తం చేసిందన్నారు. ఎంత విమర్శిస్తే అంత అభివృద్ధి వైపు దూసుకుపోతానని తేల్చి చెప్పారు.
నియోజకవర్గ ప్రజలు కోరుకున్న రీతిలో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పాలకుర్తి మండలంలో450 కోట్లతో(Rs. 450 crore) ఎత్తిపోతల పథకాన్ని అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
ఈ ప్రాంతంలోని యువత భవిష్యత్ తరానికి బంగారు బాటలు వేస్తానని ఇది నా బాధ్యత అని ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఇబ్బందులు చేసిన… ఎన్ని విధాలుగా ఆరోపణలు చేసిన రామగుండం అభివృద్ధి తన ముందున్న ప్రధాన కర్తవ్యం అని నొక్కి చెప్పారు. అభివృద్ధి చేతగాని ప్రతిపక్ష పార్టీ నేతలు చేసే ఆరోపణలకు భయపడేది లేదన్నారు.

ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికత కేంద్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు. సింగరేణి సహకారంతో ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అన్ని మతాలకు సంబంధించిన దేవాలయాలను ఊహించని రీతిలో నిర్మాణం చేసి చూపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్, మాజీ మేయర్ అనిల్ కుమార్, నేతలు మహంకాళి స్వామి బొంతల రాజేష్ గట్ల రమేష్ పాతిపెల్లి ఎల్లయ్య ముస్తాఫా వేలాది మంది ప్రజానీకం పాల్గొన్నారు.

