Rs. 1 crore | డైవర్షన్ కాల్వ‌ పునరుద్ధరణకు శంకుస్థాపన..

Rs. 1 crore | డైవర్షన్ కాల్వ‌ పునరుద్ధరణకు శంకుస్థాపన..

Rs. 1 crore | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణ సమీపంలోని వలపట్ల వద్ద ఉన్న శనగకుంట డైవర్షన్ కాలువ పునరుద్ధరణ పనులకు అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు ఇవాళ‌ శంకుస్థాపన చేశారు. ఈ పనులను అమృత్–2.0 స్కీం కింద రూ.1 కోటి 78 లక్షల(Rs. 1 crore 78 lakhs) బడ్జెట్‌తో చేపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, తమిళనాడు రాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట శాసనసభ్యులు డా.చిక్కుడు వంశీకృష్ణ(MLA Dr. Chikkudu Vamsi Krishna) సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. శంకుస్థాపన సందర్భంగా అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళి, ఏఈ, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Rs. 1 crore |

Leave a Reply