బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా రోజారాణి విజయ్

  • 1124 ఓట్ల భారీ మెజార్టీతో రికార్డు విజయం

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : మూడో విడతలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి మేకల రోజారాణి విజయ్‌కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.

తన సమీప ప్రత్యర్థి పిడుగు లయ అంజయ్యపై 1124 ఓట్ల అతి భారీ ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 1,789 ఓట్లకు గాను 1,483 ఓట్లు పోలవగా, లయ అంజయ్యకు 117 ఓట్లు మాత్రమే రాగా, రోజారాణి విజయ్‌కుమార్ 1,341 ఓట్లు సాధించారు.

ఈ ఎన్నికల్లో సాధించిన 1124 ఓట్ల మెజార్టీ మూడో విడతలో జరిగిన ఎన్నికల్లోనే కాకుండా, మండల స్థాయిలోనూ అత్యధిక మెజార్టీగా రికార్డుగా నిలిచిందని ఆమె మద్దతుదారులు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మద్దతుదారులు, గ్రామస్తులు ఆమెను ఘనంగా అభినందించారు. భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు సర్పంచ్ రోజారాణి విజయ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply