Road accident | యువతి మృతి, ఇద్దరికి గాయాలు

Road accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందిన ఘటన విషాదాన్ని నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం… నాందేడ్‌కు వెళ్లేందుకు కోల్హారి గ్రామానికి చెందిన కాగ్నే అయోధ్య బాయి తన కుటుంబ సభ్యులు అశ్విని, వసంత్ రావు, సింధే శ్రావణితో కలిసి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అశ్విని, వసంత్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, అశ్విని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
