Road Accident | అర్ధరాత్రి తప్పిన ప్రమాదం..

Road Accident | అర్ధరాత్రి తప్పిన ప్రమాదం..
Road Accident, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : విందువేళ భోజనం హోటల్ సమీపాన హౌసింగ్ బోర్డ్ రోడ్డు దగ్గర అర్ధరాత్రి ఐ20 నాలుగు చక్రాల వాహనం కరెంటు పోలును గుద్దుకుని ప్రమాదానికి లోనైంది. కారులో ప్రయాణిస్తున్న బెలూన్ ఓపెన్ అవడంతో ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. దీనికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి కావడంతో రోడ్డు మీద ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రోడ్డు మీద వ్యాపారం చేసుకునే తోపుడు బండి పూర్తిగా ధ్వంసం అయింది. పోలీసులు ఈ సంఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.
