కాంగ్రెస్ సీఎంల నిర్ణ‌యాల‌తో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి

మీట్ ది ప్రెస్‌లో రేవంత్ హాట్‌హాట్ కామెంట్స్‌…

  • బీఆర్ఎస్‌, బీజేపీది పెవికాల్ బంధం..
  • సీబీఐకి అప్ప‌గించినా కాళేశ్వ‌రం పై విచార‌ణ ఎందుకు ప్రారంభించ‌లేదు?..
  • కేటీఆర్ అరెస్టుకు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి లేదు…
  • జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓడిపోతుంది..
  • బీజేపీకి డిపాజిట్లు ద‌క్క‌వు

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : ‘ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసింది.. తెలంగాణ‌కు ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చింది.. కాంగ్రెస్ ముఖ్య‌మంత్రులు నిర్ణ‌యాల‌తో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది.. బీఆర్ఎస్(BRS) రాష్ట్రాన్ని అధోగ‌తి పాలు చేసింది.. బీఆర్ఎస్‌, బీజేపీది పెవికాల్ బందం, కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాం. ఇప్పటి వరకు విచారణ ఎందుకు ప్రారంభించలేదు?..

కేటీఆర్ అరెస్టుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదించ‌లేదు. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు గుజరాత్ తరలి వెళ్లేందుకు భాజపా నేతలు కృషి చేస్తున్నారు.. జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో బీజేపీ(BJP)కి డిపాజిట్లు రావు.. బీఆర్ఎస్ ఓడిపోవ‌డం ఖాయం.. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్(Congress) విజ‌యం సాధిస్తుంది.. ‘తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మీట్ ది ప్రెస్‌లో ఆయ‌న మ‌ట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల్లో…

  • వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో వచ్చిన శంషాబాద్ ఎయిర్ పోర్టు(Shamshabad Airport), ఓఆర్ఆర్ కూడా కీలకంగా మారాయి.
  • కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశాయి. గతంలో కాంగ్రెస్ హయాంలోనే అనేక కేంద్ర సంస్థలు నగరంలో ఏర్పాటయ్యాయి. ప్రపంచాన్నే శాసించే సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. నగరం నాలెడ్జ్ సిటీగా మారిందంటే అందుకు గతంలో కాంగ్రెస్ సీఎంలు తీసుకున్న నిర్ణయాలే కారణం. అభివృద్ధి మాత్రమే కాదు.. సంక్షేమంలోనూ వారు తమదైన ముద్ర వేశారు. 2004-2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వాలు(Congress Govts.) కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంటూ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశాయి.
  • ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి నాలుగు కోట్ల మంది ప్రజలకు ఇచ్చింది.
  • బీఆర్ఎస్‌ హయాంలో రాష్ట్రాన్ని ఆదోగతి పాలైంది. వ్యవసాయం, విద్య, వైద్యం.. ఇలా అన్నిరంగాల్లోనూ విఫలమయ్యారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా? కాళేశ్వరం లేకుండానే త‌మ ప్రభుత్వం అత్యధికంగా వరి పంటను ఉత్పత్తి చేసింది. గత పాలకులు ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? కల్వకుర్తి ఎస్ఎల్బీసీ(SLBC), బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులన్నీ పెండింగులోనే పెట్టారు. ఎలాంటి ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతిభవన్, సచివాలయం మాత్రమే కేసీఆర్ పూర్తిచేశారు.
  • కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదు. కుమారుడి విషయంలో కేసీఆర్ ద్రుతరాష్ట్రుడిలా మారారు. కేటీఆర్ దశే బాగాలేకపోతే కేసీఆర్ ఎన్ని దిశలు మార్చినా ఏం లాభం? కేటీఆర్ ఆరెస్టు కు గవర్నర్(Governor) అనుమతి ఇవ్వలేదు. కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కూడా నేను రద్దు చేయలేదు. వాటిని కొనసాగిస్తూ అదనంగా అనేక కొత్తపదకాలు తీసుకొచ్చాను.
  • ఎస్సీ వర్గీకరణపై ఎవరూ చేయని సాహసం చేశాను వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపాను. దేశంలో ఎవరూ చేయని కులగణనను రాష్ట్రంలో చేసి చూపించాను. తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించాను, మహిళలకు ఉచిత ప్రయాణం సహా అనేక ఎన్నికల హామీలు నెరవేర్చాను.
  • రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు గుజరాత్ తరలి వెళ్లేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు. సెమీ కండక్టర్ల కంపెనీ(Semi Conductors Company) ఆ రాష్ట్రానికి తరలించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి యత్నిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధం, కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాం. ఇప్పటి వరకు విచారణ ఎందుకు ప్రారంభించలేదు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ తెచ్చుకుంటే బీజేపీ దేశం మొత్తం గెలిచినట్లే. మరో 8 ఏళ్లు తామే అధికారంలో ఉంటాం. 2028 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు రావు, 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయి. 2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది.

Leave a Reply