Revanth Reddy | ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు…

Revanth Reddy | ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు…
Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో విద్యా వ్యవస్థలో పెద్ద మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకురాబోతున్నామని తెలిపారు. ఇకపై టెన్త్ పరీక్షలు ఉండబోవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం పలు అంశాలపై మాట్లాడారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.
