బెంగళూరు – దాదాపు 18 రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (International space center ) అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Indian astronaut Subhanshu Sukla) సహా మరో ముగ్గురి వ్యోమగాముల భూమికి తిరుగు ప్రయాణం (return journey ) మొదలైంది. ఐఎస్‌ఎస్‌లో యాక్సి యం-4 మిషన్ అన్‌డాకింగ్ (Un docking success )ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. అనుకున్న సమయానికంటే పది నిమిషాలు ఆలస్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ‘డ్రాగన్’ వ్యోమనౌక విడిపోయింది. 23 గంటలపాటూ ప్రయాణించిన తర్వాత ఆ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ (space craft ) భూమి మీదకు రానున్నది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వ్యోమగాములు ఫ్లోరిడాలోని (florida ) నదీ జలాల్లో దిగనున్నారు.
ఏడు రోజులు క్వారంటైన్..
వ్యోమగాములు భూమికి చేరిన తర్వాత ఏడు రోజులపాటూ క్వారంటైన్‌కు తరలించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇస్రోకు చెందిన ఫ్లైట్ సర్జన్లు వారం రోజుల పాటూ వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారని వెల్లడించింది.
శుభాన్షు రికార్డు..
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లాతోపాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వస్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లిన తొలి భారతీయుడు కూడా ఇతనే.