Resource | మహిళల సాధికారతకు కట్టుబడి ఉంది…

Resource | మహిళల సాధికారతకు కట్టుబడి ఉంది…

Resource | ఆముదాలవలస, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో మహిళల సాధికారత దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఆముదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ఆదివారం జెండర్ రిసోర్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, మహిళలు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతమైన స్థానంలో ఉండగలరని అన్నారు.

మహిళలే ఆర్జించగలరు, అభివృద్ధి చెందగలరు, సమాజానికి నాయకత్వం వహించగలరని, వారికి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మహిళల చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. జెండర్ రిసోర్స్ సెంటర్ ద్వారా మహిళలకు శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి తరగతులు, స్వయం ఉపాధి మార్గదర్శకత్వం, న్యాయ, సామాజిక అవగాహన సేవలు అందించనున్నట్లు తెలిపారు.

ఈ కేంద్రం మహిళలకు మార్గనిర్దేశక వేదికగా నిలిచి, వారి సామాజిక, ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాన అవకాశాలు సృష్టించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మహిళల అభివృద్ధి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గ స్పష్టం చేశారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం మహిళలలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. స్థానిక మహిళా సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, డిఆర్డిఏ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply