Reservoir | గ్రామస్తుల ఆందోళన..

Reservoir | గ్రామస్తుల ఆందోళన..

Reservoir, ఏర్పేడు, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా (Tirumala) ఏర్పేడు మండలం ఇసుక తాగేలి గ్రామపంచాయతీకి చెందిన చెరువు కలుజు సమీపంలో గండి పడింది. చెరువులోని నీరంతా కలుజువద్ద పడిన గండి ద్వారా వెలుపలకు వెళ్ళిపోతూ ఉంది. ఈ చెరువుకు మళ్లీ మడుగు రిజర్వాయర్ నుంచి నీరు ఉధృతంగా వస్తుండడంతో చెరువు కలుజు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అయితే.. చెరువు కలుజు సమీపంలో గండి ఏర్పడింది. ఈ చెరువు కింద సుమారు 100 ఎకరాలకు పైగా సాగు భూములు ఉన్నాయని వైసీపీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం చెరువుకు నీటి సంఘం అధ్యక్షులుగా ముని రామరెడ్డి వ్యవహరిస్తున్నారు. గండి అరికట్టకపోతే.. పై నుంచి ఉధృతంగా వస్తున్న నీటి ప్రవాహం వల్ల పెద్ద పెను ప్రమాదానికి దారి తీయనుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply