చేనేత రిలే దీక్షలకు మద్దతివ్వాలని కేటీఆర్ కి వినతి

చేనేత రిలే దీక్షలకు మద్దతివ్వాలని కేటీఆర్ కి వినతి

మోత్కూర్, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ని సోమవారం హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిసి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మార్చి 23,24,25 తేదీలలో ఇందిరా పార్కు లో జరిగే రిలే నిరాహార దీక్షా శిభిరంను సందర్శించి , చేనేత కార్మిక సంఘం రిలే నిరాహార దీక్షలకు మద్దత్తు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతి కుమార్ , కార్యదర్శి ముషం నరహరి విజ్ఞప్తి చేశారు.సానుకూలంగా స్పందించిన కె టి ఆర్ తప్పకుండా రిలే నిరాహార దీక్షా శిభిరంనకు వస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Leave a Reply