ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి…..

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి…..
బీజేపీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్……..
రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండలంలోని అన్ని బూత్ లలో బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏప్రిల్ 6 న ఘనంగా జరుపుకోవాలని అదేవిధంగా ప్రతి బీజేపీ కార్యకర్త ఇంటిపైన భారతీయ జనతా పార్టీ జెండాను విధిగా కట్టాలన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని రేగొండ మండల కేంద్రంలో ఉదయం 9:00 గంటలకు భారత్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు భూత్ అధ్యక్షులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమన్ని విజయవంతం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
