జనసేన పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం

జనసేన పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం
భవానిపురం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కృష్ణా పెన్నా రీజియన్ కో ఆర్డినేటర్ రావి సౌజన్య ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎం ఎస్ ఎం ఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ వారి సతీమణి విజయలక్ష్మి, విజయవాడ సిద్ధార్థ ఇనిస్ట్యూట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యార్లగడ్డ పావని, సామాజికవేత్త కొర్రెల సాయి ప్రియ వర్ధన్, హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కటింగ్, జనసేన పార్టీకి చెందిన వీర మహిళలకి శాలువాలుతో పాటు ఇచ్చి గౌరవించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు జనసేన పార్టీ ఆశయాల్లో భాగంగా మహిళలకి గౌరవం ఇవ్వాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావం నుండి వీర మహిళా విభాగం పెట్టి మహిళలను ఎంతగానో గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు.
అనంతరం కృష్ణ పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ రావి సౌజన్య మాట్లాడుతూ ప్రజా సమస్యలపై జనసేన పార్టీ సిద్ధాంతాలపై వీర మహిళలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న పోరాటాలు మహిళలకు ఆదర్శవంతంగా నిలిచాయన్నారు. జనసేన పార్టీలో నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకి చెందిన జనసేన పార్టీకి చెందిన వీర మహిళా విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
