తిరుమల : సెప్టెంబర్ 7వ తేదిన చంద్రగ్రహణం (lunar eclipse) కారణంగా సాయంత్రం 3.30 గంటల నుండి 8వ తేది ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని (Srivari temple) మూసివేయనున్న విషయం విదితమే. ఈ కారణంగా సెప్టెంబర్ 8వ తారీఖు దర్శనం కోసం 7వ తేది వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. 8వ తేది నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు.
అదేవిధంగా 7వ తేదిన శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల (Srivani offline darshan) సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేయడం జరిగింది. కాగా సెప్టెంబర్ 16వ తేదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam 2025) కారణంగా సెప్టెంబర్ 15వ తేదిన వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.