ప్రారంభానికి సిద్ధం.. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం..

ప్రారంభానికి సిద్ధం.. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం..
- ప్రతిష్టాత్మకంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
- స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలు.
- వెలుస్తున్న పార్టీ దిమ్మలు..
- వాటికి తుది మెరుగులు దిద్దుతున్న పార్టీ శ్రేణులు..
- ప్రారంభించనున్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా..
పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ప్రతిష్టాత్మకంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలు, పార్టీ దిమ్మలు వెలుస్తున్నాయి. వాటికి పార్టీ శ్రేణులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలను, పార్టీ దిమ్మలను సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా నేడు ప్రారంభించనున్నారు. తెలుగుదేశం పార్టీ 44 వసంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ పిలుపు మేరకు శ్రేణులు నూతన ఎన్టీఆర్ విగ్రహాలు, పార్టీ దిమ్మలను నిర్మాణాలు జరిపి వాటికి పసుపు రంగులు దిద్దుతున్నారు.
స్థానిక 64 వ డివిజన్ కండ్రికలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్, సెంటర్ నియోజకవర్గ శాసనసభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆవిష్కరించనున్నారు. అలాగే 59వ డివిజన్లో నూతనంగా నిర్మించిన పార్టీ దిమ్మలను పార్టీ శ్రేణులు బుదాల సురేష్ శ్రేణులు పసుపురంగులు దిద్దుతున్నారు. ఏది ఏమైనా సెంట్రల్ టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో సన్నాహాలు చేస్తున్నారు.

