RCB vs GT | బెంగ‌ళూరుకు బ్రేక్.. గుజ‌రాత్ ఖాతాలో మరో విక్టరీ !!

బెంగళూరులోని ఆర్సీబీ సొంత గడ్డపై గుజరాత్ టైట‌న్స్ సునాయ‌స విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచిన టైటాన్స్.. బెంగళూరు జట్టు నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ ఛేజింగ్‌లో గుజరాత్ బ్యాట‌ర్లు విరుచుకుప‌డ్డారు. జోస్ బట్ల‌ర్ (39 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సుల‌తో 73 నాటౌట్) హాఫ్ సెంచ‌రీతో ప‌రుగుల సునామీ సృష్టించాడు. ఇక‌ ఓపెనర్ సాయి సుదర్శన్ (49) మరోసారి తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

కాగా, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (14) అవుట్ అయిన తర్వాత.. జోస్ బట్లర్‌తో చేతులు కలిపిన సుదర్శన్… రెండో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు.

సాయి సుదర్శన్ ఔట్ అయిన తర్వాత వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 1ఫోర్, 3సిక్సుల‌తో 30 నాటౌట్) కూడా తన సత్తా చాటాడు. జోస్ బట్లర్‌తో కలిసి రూథర్‌ఫోర్డ్ 3వ వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ ఒక్కో వికెట్ తీశారు.

అంత‌క ముందు బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు జ‌ట్టు బ్యాటింగ్ లో పూర్తిగా తేలిపోయింది. గుజ‌రాత్ బౌల‌ర్ల ధాటికి ఆర్సీబీ టాపార్డ‌ర్ 6.2 ఓవర్ల‌లోనే కుప్ప‌కూలింది. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన జితేష్ శ‌ర్మ (33), లివింగ్ స్టోన్ (54), టిమ్ డేవిడ్ (32) ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు.

గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 3 వికెట్ల‌తో అద‌ర‌గొట్టాడు. సాయి కిషోర్ రెండు వికెట్లు తీసుకోగా.. అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలా ఒక వికెట్ తీశారు. దీంతో 170 ప‌రుగుల టార్గెట్ తో గుజ‌రాత్ టైట‌న్స్ ఛేజింగ్ ప్రారంభించ‌నుంది.

ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ 3వ స్థానానికి పడిపోయింది. బెంగ‌ళూరుపై గెలిచిన గుజరాత్ టైటాన్స్ నాల్గవ స్థానంలో కొనసాగుతోంది.

Leave a Reply