Ravindhar |పర్యావరణ పరిరక్షణ.. ఆరోగ్యం.. సైకిళ్లతో సాధ్యం

Ravindhar |పర్యావరణ పరిరక్షణ.. ఆరోగ్యం.. సైకిళ్లతో సాధ్యం

బైకులు, కార్ల బదులు సైకిళ్ల వినియోగం పెరగాలి
ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్నీ కాపాడుకుందాం
మంగినపూడి బీచ్ వద్ద సొంత ఖర్చులతో 10 సైకిళ్లు ఏర్పాటు చేస్తా
మార్కెట్ యార్డు వద్ద ఈ సైకిళ్ల పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర

Ravindhar |మచిలీపట్నం, ఆంధ్రప్రభ; సైకిల్ వినియోగం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటుగా.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే వెసులుబాటు కలుగుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని మార్కెట్ యార్డు వద్ద డ్వాక్రా మహిళలకు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నప్పటి సైకిల్ స్మృతులను గుర్త చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సబ్సిడీతో ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. సైక్లింగ్ ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అందరికీ తెలియజేస్తున్నాం. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో సైకిళ్ల వినియోగం భారీగా పెరుగుతోంది. సుమారు రూ.35 వేల విలువైన సైకిళ్లను రూ.24 వేలకే అందిస్తున్నారు. ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించుకోవడం ద్వారా మన ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా వృధా కాకుండా కాపాడుకునే అవకాశం లభిస్తోంది. మంగినపూడి బీచ్ లో 10 సైకిళ్లు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. బీచ్ చూడ్డానికి వచ్చిన వారికి సైకిళ్లు అందుబాటులో ఉంచుతామన్నారు.

ప్రత్యేకంగా డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలని ఆశిస్తున్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఉంటేనే ఆదాయం వస్తది. ఆరోగ్యం పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే వ్యాయామాన్ని నిత్య జీవనంలో అలవాటుగా చేసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.

Leave a Reply