Ranveer Singh | వారికి బెదిరింపులు

Ranveer Singh | వారికి బెదిరింపులు

Ranveer Singh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నటుడు రణ్‌వీర్‌ సింగ్‌, దర్శకుడు రోహిత్‌ శెట్టిలకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి హత్య చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వారిని, వారి సిబ్బందిని చంపేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఈ వార్తలు సినీ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ బెదిరింపులకు గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక వాయిస్ నోట్ రూపంలో వచ్చిన ఈ వార్నింగ్‌లో అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీని వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో రణవీర్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు. ముంబైలోని ఆయన నివాసం వద్ద పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌ల పహారాను పెంచారు.

Leave a Reply