నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా

నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా
హితాన్ని బోధించే పండుగ రంజాన్
11వ వార్డులో, నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ
మున్సిపల్ కౌన్సిలర్ నహీద బేగంం
మక్తల్ ,ఆంధ్రప్రభ : క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశమని మక్తల్ 11వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ నహీద బేగం అన్నారు. సోమవారం సాయంత్రం 11వార్డు బుర్హన్ గడ్డ లో రంజాన్ తోఫా పేద ముస్లింలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నారని కొనియాడారు.
మక్తల్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో గతంలో ఎన్నడు లేని విధంగా మైనారిటీల సంక్షేమం కొరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింలు సైతం పండుగను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ తోఫాలో భార్యాభర్తల తో పాటు కూతురుకు సంబంధించిన బట్టలు అందజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రధాన పట్టణాలలో ప్రభుత్వపరంగా ఇఫ్తార్ విందు కూడా ఇవ్వడం జరిగింది అన్నారు.
మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంజూర్ ఇలాహి ,ఎన్ఎస్యూఐ నాయకుడు అఫ్రోజ్ ,కాంగ్రెస్ నాయకులు నసీర్,నయూం,యాసీన్, షాబుద్దీన్, రఫీ,రహీం,మైను, ఇమ్రాన్,హబీబ్,అన్వర్ తదితరులు పాల్గున్నారు.
