జాతీయ అవార్డుకి ఎంపికైన రాకేష్ రెడ్డి..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాలలో పనిచేస్తున్నప్రభుత్వ ఉపాధ్యాయులు పీఆర్ టీయూ భూపాలపల్లి జిల్లా అద్యక్షులు మన రాకేష్ రెడ్డి సామాజిక సేవా విభాగంలో ఉత్తమ డిఫెండర్ అవార్డు ఎంపైకైనట్లు ప్రఖ్యాత పాన్ ఇండియా సంస్థ ప్రకటించింది. అత్యధిక సార్లు రక్తదానం చేయడం, ఇతరులను ప్రోత్సహించడం, యువనేతాజీ ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరాలను నిర్వహించడం, సమాచార విస్తరణ, సామాజిక స్పూహ నాయకత్వ లక్షణాలకు ఈ అవార్డు ఎంపిక చేసినట్లు పాన్ ఇండియా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 8వ తేదీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిర్లా సైన్స్ ఆడిటోరియంలో అవార్డ్ ప్రదానోత్సవం హిమాచల్ ప్రదేశ్ అండ్ హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నటి ఆమని చేతుల మీదుగా ఈ అవార్డు ప్రధానం చెయ్యనున్నారని తెలిపారు.

Leave a Reply