Rajiv Gandhi | ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

Rajiv Gandhi | ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

Rajiv Gandhi | క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీజోన్ రాజీవ్ చౌక్‌లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పిన్నింటి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర సాధన నుంచి అభివృద్ధి వరకు కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పనస రాజు, చైర్మన్ జంగం కల, కనకరాజు, నక్క శ్రీనివాస్, కురుమ సురేందర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply