Quality | నాణ్యమైన భోజనం అందించాలి…

Quality | నాణ్యమైన భోజనం అందించాలి…
Quality| నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కలెక్టరేట్ సిబ్బంది, కలెక్టరేట్ కు సందర్శనకు వచ్చే సందర్శకులకు రుచికరమైన, పరిశుభ్రత పాటించి నాణ్యమైన భోజనాన్ని అందించి, వారి మన్ననలు పొంది వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి పరుచుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ (Badawat Santosh) ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులకు సూచించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. క్యాంటీన్ లో సమోసా, కాఫీ ని కలెక్టర్ స్వీకరించి, రుచి చూశారు.
క్యాంటీన్ (Canteen) పరిసరాలను, భోజనం, కూరగాయల నాణ్యత ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించారు. క్యాంటీన్ ఎలా నడుస్తుందని, ఎంత మంది వస్తున్నారని క్యాంటీన్ నిర్వాహకులు అర్చనను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ అభివృద్ధికి ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ లో జరిగే ప్రతి కార్యక్రమానికి మీ క్యాంటీన్ నుండే టీ, స్నాక్స్ సరఫరా చేస్తున్నారు కదా అని అడిగారు.

బయటి హోటల్స్ కంటే రుచికరంగా భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రతిరోజు రుచికరంగా, శ్రుచికర వాతావరణంలో వంటలను వండి క్యాంటీన్ కి వచ్చే వారికి రుచిగా ఆస్వాదించేలా ఆహార పదార్థాలను అందించి, సిబ్బంది, కలెక్టరేట్ (Collectorate) సందర్శకుల మన్ననలు పొంది క్యాంటీన్ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ కోరారు. సోమవారం నుండి చికెన్ బిర్యాని, చికెన్ కర్రీ ఇతర రుచికరమైన వంటలు అందుబాటులోకి తెస్తున్నట్లు క్యాంటీన్ నిర్వహకురాలు అర్చన కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, డీఆర్డీఏ డీపీఎం కృష్ణ, ఏపీఎం చారి, తదితరులు ఉన్నారు.
