Psychiatrists | ప్రణాళికతో చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చు

Psychiatrists | ప్రణాళికతో చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చు

  • ప్రముఖ మానసిక నిపుణులు అల్లాడ సురేష్

Psychiatrists | ముధోల్, ఆంధ్రప్రభ : ప్రణాళికతో చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చని ప్రముఖ మానసిక నిపుణులు(Psychiatrists) అల్లాడ సురేష్ పేర్కొన్నారు. ముధోల్ మండల కేంద్రంలోని రబింద్రా ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా మోటివేషన్ తరగతిని అందించారు. ప్రముఖ మానసిక నిపుణులు అల్లాడ సురేష్ మాట్లాడుతూ… విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉండాలని, పరీక్షలు సమీపిస్తున్న కొలది ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుందిని, ఒత్తిడికి లోను కాకుండా లక్ష్యంవైపు దూసుకుపోవాలని అన్నారు.

విద్యార్థులు జంక్ ఆహారానికి అలవాటు పడకూడదని, దాన్ని పూర్తిగా దూరం పెట్టాలని లేకపోత్చే అనేక అనారోగ్యాలకు దారి తీస్తుందని, ఇంట్లో చేసిన ఆహరపదార్ధాలే తినాలని పేర్కొన్నారు. ప్రశాంతతకోసం ఆటలు, యోగా, ఫజిల్స్(Yoga, Fuzzles) లాంటివీ చేస్తూ ఉండాలని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ సాయినాథ్ మాట్లాడుతూ ప్రభుఖులు సురేష్ చెప్పిన మాటలు, విద్యార్థుల జీవన ప్రగతికి సోపానాలు పాటించాలని తెలిపారు.

తదనంతరం అతిథులను పన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్, ఆనిందిత పాండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ కూడా విశిష్ట అతిధిగా వచ్చేసి విద్యార్థులకు సూచనలు, సలహలు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply