అందం, ఆకర్షణలో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా రేంజే వేరు. హాలీవుడ్ లో తాను ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి పీసీనే ప్రధాన ఆకర్షణ. అందుకే ఇప్పుడు మహేష్- రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా చేరడంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జయిట్ అయ్యారు.
ఎస్ఎస్ఎంబి 29 చిత్రీకరణ దశలో ఉండగానే ప్రియాంక చోప్రా రెగ్యులర్ ఫోటోషూట్లు గుబులు రేపుతున్నాయి. తాజాగా పీసీ ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై గుబులు రేపే ఫోజులతో రెచ్చిపోయింది. ప్రఖ్యాత ఎస్ ప్రైర్ మ్యాగజైన్ కవర్ పేజీపై పీసీ రకరకాల డిజైనర్ దుస్తులతో చెలరేగిపోయింది.
బ్లాక్ అండ్ బ్లాక్.. వైట్ అండ్ వైట్ డిజైనర్ లుక్స్ తో పాటు, రకరకాల భంగిమల్ల పీసీ కనిపించింది. కాగా, . మహేష్ బాబుతో కలిసి ఎస్ఎస్ రాజమౌళి సినిమా చిత్రీకరణలోను ప్రియాంక నటిస్తోంది. ది బ్లఫ్‌లో 19వ శతాబ్దపు కరేబియన్ పైరేట్‌గా కూడా కనిపిస్తుంది.










