Preparation | బీసీలను సన్నద్ధం చేయండి..

Preparation | బీసీలను సన్నద్ధం చేయండి..

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరావు యాదవ్

Preparation | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేస్తుందని.. అందులో భాగంగ నంద్యాల జిల్లాలోని బీసీ నాయకులను కూడ సిద్ధం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి, జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు లక్ష్మి నారాయణలను (Lakshmi Narayana) ఆదేశించారు. ఈ మేరకు పట్టణంలోని జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో నంద్యాల జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని గ్రామ మండల నియోజకవర్గం జిల్లా స్థాయిలో కమిటీని నిర్మాణం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి, జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణకు తెలిపారు. అలాగే బీసీలలో రాజకీయ చైతన్యం లేక రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కులు కోల్పోతున్నారని అన్నారు.

అలాగే బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రావలసిన రాజకీయ వాటాలు కూడా కోల్పోతున్నామని అందుకు బీసీలను చైతన్యం చేస్తూ ప్రతి గ్రామంలో బీసీల గ్రామ సభలు (Village councils) నిర్వహించాలని. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కులాలను బీసీ జాబితాలో చేర్చి బిసి లకు పెంచాల్సిన రిజర్వేషన్లు పెంచకుండ రిజర్వేషన్లు 50% దాటకూడదు అని న్యాయస్థానాల బూచి చూపుతూ బిసి లకు అందవలసిన రాజకీయ రిజర్వేషన్ కోల్పోవాల్సి వస్తుందని అందులో భాగంగ బిసి లను చైతన్యం చేస్తూ రిజర్వేషన్లు లోనే కాకుండ ఓపెన్ క్యాటగిరి లో కూడా పోటీ చేసే విధంగ వారిని చైతన్యం చేసి అందుకు సిద్ధం చేయాలని రాబోవు స్థానిక సంస్థలలో సర్పంచ్. ఎంపిటిసి ఎంపీపీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు. కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు మెజార్టీగా ఈసారి బీసీలు కైవసం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అన్ని జిల్లాలలో పర్యటించి అందుకు సిద్ధం చేస్తున్నానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్. నంద్యాల జిల్లా యువజన విభాగం అధ్యక్షులు లక్ష్మీనారాయణ యాదవ్.బిసి సంఘం నందికొట్కూరు నాయకులు గుడుసాహెబ్ బలరాముడు శ్రీనివాసులు ధను వెంకటేశ్వర్లు గౌడ్ ఆత్మకూర్ మదిలేటీ ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply