గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి

గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి

  • ఐసీడీఎస్ సూపర్ వైజర్ సువర్ణ

కడెం, ఆంధ్రప్రభ ; గర్భిణీ మహిళలు బాలింతలు సరైన పౌష్టిక ఆహా రం తీసుకోవాలని అంబారిపేట్ సెక్టర్ ఐసిడిఎస్ సూపర్ వైజర్ సువర్ణ నవాబ్ పేట్ గ్రామ సర్పంచ్ జుట్టు శంకరయ్య పోషకులకు కోరారు. మండలంలోని నవాబ్ పేట్ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక గ్రామ సర్పంచ్ జుట్టు శంకరయ్య అంబారిపేట్ సెక్టర్ ఐసిడిఎస్ సూపర్ వైజార్ సువర్ణ ఆధ్వర్యంలో చిన్నారి పిల్లలకు అన్న ప్రసన్న గర్భిణీ మహిళలకు సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రభుత్వ పౌష్టికాహారం సరుకులు మధ్యాహ్న భోజనం ఆటపాటల ద్వారా విద్యా బోధన అందిస్తారన్నారు గర్భిణీ మహిళలు సరైన పౌష్టిక ఆహారం తీసుకోవాలన్నారు ఇందులో స్థానిక అంగన్వాడీ టీచర్ ఎం సత్యవ్వ గర్భిణీ మహిళలు బాలింతలు పిల్లల తల్లులు పిల్లలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply