నివాళులర్పించిన ప్రతాప్ రెడ్డి
గజ్వేల్, అక్టోబర్ 27( ఆంధ్ర ప్రభ) : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (HarishRao) తండ్రి సత్యనారాయణ రావు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి హైదరాబాద్ లోని వారి నివాసంలో సత్యనారాయణరావు భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని కోరారు.

