Power Star | పవర్ స్టార్ స్పీడు పెంచబోతున్నారా..?

Power Star | పవర్ స్టార్ స్పీడు పెంచబోతున్నారా..?
Power Star | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత బిజీ అవ్వడంతో సినిమాలు తగ్గించేసారు. ఒప్పుకున్న సినిమాలు (Movies) పూర్తి చేయడానికే చాలా టైమ్ పట్టింది. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేయాల్సివుంది. ఇదిలా ఉంటే.. పవన్ ఇక సినిమాలకు పూర్తిగా దూరం అవుతారని గతంలో ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు హీరోగా కాకుండా.. నిర్మాతగా వరుసగా సినిమాలు నిర్మించాలి అనుకుంటున్నారు. ఆయన ప్లాన్ ఏంటో కూడా అనౌన్స్ చేశారు. ఇంతకీ.. పవర్ స్టార్ ప్లాన్ ఏంటి..?

Power Star | నిర్మాతగా పవర్ స్టార్..
పవన్ కళ్యాణ్ స్థాపించిన పవన్ కళ్యాణ్ (Pawankalyan) క్రియేటివ్ వర్క్స్, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి గొప్ప చిత్రాలను ప్రేక్షకులను అందించడానికి సిద్ధమవుతున్నాయి. గతంలోనే ఈ సంస్థల మధ్య కథలకు సంబంధించిన చర్చలు జరిగాయి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలిసి రాబోయే ప్రాజెక్టుల పై చర్చించారు. పవన్ కళ్యాణ్, టీజీ విశ్వప్రసాద్ భేటీ గురించి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ స్పందిస్తూ.. కొత్త ఆరంభాల స్ఫూర్తిని సూచిస్తూ, రాబోయే ప్రాజెక్టుల పై గతంలో జరిగిన చర్చలను కొనసాగిస్తూ, పవన్ కళ్యాణ్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ని కలిసి మరింత విస్తృతంగా చర్చించారు అని తెలిపింది.

Power Star | అద్బుత ప్రయాణం..
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ కి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) బదులిస్తూ.. కథల పై చర్చించడానికి మాకు అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది మాకు ఎంతో విలువైనది. ప్రేక్షకులకు బలమైన, అర్థవంతమైన, ప్రభావవంతమైన కంటెంట్‌ను అందించేందుకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఈ కలయిక మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ అద్భుత ప్రయాణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం అని తమ సంతోషాన్ని పంచుకున్నారు. మొత్తానికి నిర్మాతగా ఎక్కువ సినిమాలు నిర్మించాలని పవన్ డిసైడ్ అయ్యారు. మరి.. ఈ ప్రతిష్టాత్మమైన బ్యానర్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో.. ఫస్ట్ మూవీని ఎవరితో తీస్తారో అనేది ఆసక్తిగా మారింది.

