Post-mortem | కారు ఢీ…

Post-mortem | కారు ఢీ…
Post-mortem | మొవ్వ – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లాలోని మొవ్వ మండలం నిడిమోలులో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మచిలీపట్నం వైపు వెళ్తున్న ఓ కారు రోడ్డు దాటుతున్న మద్దుల రోజా (30) అనే మహిళను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
