Pooja hegde | ఈసారైనా ఫామ్ లోకి వచ్చేనా..?

Pooja hegde | ఈసారైనా ఫామ్ లోకి వచ్చేనా..?

Pooja hegde | బుట్టబొమ్మగా పాపులరైన పూజా ప్రయాణం
త్రివిక్రమ్ సినిమాలతో వచ్చిన సక్సెస్
ఆఫర్స్ తగ్గిన తర్వాత పరిస్థితి
కొత్త అవకాశంతో మళ్లీ కంబ్యాక్ ఆశలు

Pooja hegde | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పూజా హేగ్డే అనే కంటే.. బుట్టబొమ్మ అంటే చాలు ఠక్కున గుర్తొస్తుంది. ఈ అమ్మడు అంతలా యూత్ లో మంచి క్రేజ్ (Crage) తెచ్చుకుంది. అయితే.. టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి టైమ్ లో.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పూజాకు ఆఫర్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఏ సినిమాలో..? అసలు ఇది నిజమేనా..?

Pooja hegde

Pooja hegde | బుట్టబొమ్మగా పాపులరైన పూజా..

త్రివిక్రమ్ డైరెక్షన్ లో పూజా మొదటిసారి అరవింద సమేత సినిమాలో నటించింది. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జంటగా నటించింది. యంగ్ టైగర్ కు కమర్షియల్ గా సక్సెస్ అందించడమే కాకుండా.. మంచి పేరు తీసుకువచ్చింది. ఆతర్వాత పూజా త్రివిక్రమ్ డైరెక్షన్ (Direction) లో అల.. వైకుంఠపురములో అనే సినిమాలో నటించింది. ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇందులో బుట్టబొమ్మ పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ బ్యూటీకీ బుట్టబొమ్మ అనే పేరును తీసుకువచ్చి మరింత పాపులర్ అయ్యేలా చేసిందీ సినిమా.

Pooja hegde

Pooja hegde | ఆదర్శ కుటుంబంలో పూజా..

ఈ రెండు సినిమాల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో పూజా మరో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే.. గుంటూరు కారం. ఈ సినిమాలో ముందుగా కథనాయికగా పూజానే అనుకున్నారు. అయితే.. ఆమె వేరే ప్రాజెక్టులో బిజీగా ఉండడం వలన కుదరలేదు. ఇప్పుడు మళ్లీ త్రివిక్రమ్ సినిమాలో పూజా నటిస్తుందని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఏ సినిమాలో అంటే.. ప్రస్తుతం గురుజీ ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్నారు. ఇందులో వెంకీకి జంటగా శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) నటిస్తుంది. అయితే.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ కోసం పూజాను తీసుకోబోతున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే.. పూజా మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.

Pooja hegde

Leave a Reply