Polling | ఓటు గుర్తుల మార్పు.. ప్రజల్లో ఆందోళన..

Polling | ఓటు గుర్తుల మార్పు.. ప్రజల్లో ఆందోళన..


Polling | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : తంగళ్ళపల్లి సర్పంచ్ ఎన్నికల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అభ్యర్థుల గుర్తుల మార్పుతో రాజకీయ వేడి పెరిగింది. ఓట్లు నిర్ణయించే గుర్తులే మారడంతో తంగళ్ళపల్లిలో పోలింగ్ (Polling) ముందే కలకలానికి దారి తీసింది. సర్పంచ్ రేస్‌లో ఉన్న అభ్యర్థుల గుర్తులను అధికారులు మార్చారు. గ్రామానికి చెందిన ఇటిక్యాల మహేందర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయనకు ముందుగా కత్తెర గుర్తు కేటాయించి తర్వాత మళ్లీ ఉంగరం గుర్తును అధికారులు కేటాయించారు. కత్తెర గుర్తు అని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థి ప్రచారం కూడా చేసుకోవడం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో అధికారులు మళ్లీ ఉంగరం గుర్తు కేటాయించగా అభ్యర్థి అయోమయంలో పడ్డాడు. ఎన్నికల నిబంధనలలో కీలక మార్పుతో తంగళ్ళపల్లిలో గుర్తుల మార్పు పై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. అభ్యర్థుల అనుచరుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ గుర్తులు మార్పు పరిణామం పై ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply