Police | మంచి పోలీసును కోల్పోయాం…

Police | మంచి పోలీసును కోల్పోయాం…
Nalgonda | సూర్యాపేట, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ శీలం కమలాకర్(Constable Seelam Kamalakar) మృతి చెందటం బాధాకరం అని జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కమలాకర్ మృతదేహానికి పూలమాల వేసి నివాళి ఘటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందడం ఆవేదన కలిగించిందన్నారు.
ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, కమలాకర్ మంచి సర్వీస్ రికార్డు(Service Record) కలిగిన వ్యక్తి, ఒక మంచి పోలీస్‌ను కోల్పోయామన్నారు. కమలాకర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం అని, కమలాకర్ ఆశయాలు, ఆలోచనలు ముందుకు తీసుకెళతామన్నారు. పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజల రక్షణలో, సమాజ రక్షణలో ప్రాణాలు పణంగా పెట్టీ నిరంతరం పని చేస్తున్నారన్నారు. విధుల నిర్వహణలో పోలీసు సిబ్బంది(Police Staff) అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఆయన వెంట నివాళులు అర్పించిన వారిలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ నాగేశ్వరరావు, వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్ ఉన్నారు.
