Police Station | లక్కీ డ్రా పేరుతో మోసం…

Police Station | లక్కీ డ్రా పేరుతో మోసం…
Nizamabad | బిక్కనూర్, ఆంధ్రప్రభ : లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఒక వ్యక్తిని ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బిక్కనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్(Inspector Sampath Kumar) తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రాజంపేట మండలం బసనపల్లి గ్రామానికి చెందిన గడ్డం రాజు(Gaddam Raju) తన పేరున ఉన్న రెండు ఎకరాల 10 గుంటల భూమిని లక్కీ డ్రా పేరుతో అమ్మాలని నిర్ణయించుకొని పాంప్లెట్స్ ప్రింట్(printed pamphlets) చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని చెప్పారు. 10,000 రూపాయలు చెల్లించిన వారికి లక్కీ డ్రా(Lucky Draw)లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు. 500 టోకెన్లు పూర్తయిన తర్వాత డ్రా తీస్తామని ఆయన ప్రచారం చేయడంతో పలువురు వ్యక్తులు పదివేల రూపాయలు ఆయనకు చెల్లించినట్లు తెలిపారు.
మరి కొంతమంది చెల్లించేందుకు సిద్ధమవ్వగా ఎలాంటి అనుమతులు లేకుండా మెగా డ్రా పేరుతో ప్రచారం నిర్వహిస్తున్న విషయం చట్ట విరుద్ధమని ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. అనంతరం మెగా డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్న రాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఆయన వివరించారు. అనుమతులు లేకుండా ఎవరు ఎలాంటి స్కీంలు(schemes) నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి స్కీంల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
