Police | శాంతిభద్రతల పరిరక్షణ కోసం..

Police | శాంతిభద్రతల పరిరక్షణ కోసం..
- సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 112 కాల్ చేయండి..
- శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ధ్యేయం..
- గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం..
Police, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గ్రామాలలో పోలీస్ అధికారులు పర్యటించి పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ (DSP) ప్రమోద్ సూచనలతో కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌదరిదీన్నే గ్రామంలో సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు గ్రామ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల గురించి వాటి బారిన పడకుండా ఏ విధంగా అప్రమత్తంగా వ్యవహరించాలో అవగాహన కల్పించడంతో పాటు గ్రామంలో ప్రజలు అందరూ సోదర భావంతో ఐకమత్యంగా ఎంతో ప్రశాంతంగా జీవించాలని ఏదైనా సమస్య ఉంటే వారి దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.
మహిళలు, చిన్నారుల కోసం పోలీస్ శాఖ అండగా ఉంటుందని, మహిళ భద్రత కోసం ప్రత్యేకంగా శక్తిగా రూపొందించి అమలు చేయడం జరుగుతుంది. ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించిన, వెంటపడి వేధించినా, నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. అనంతరం జూదం, క్రికెట్ బెట్టింగ్, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళ్లకుండా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్దమని శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నేరాలను కట్టడి చేసేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే.. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 112 కు కాల్ చేసి సమాచారం అందించాలని, మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
