మానవత్వం చాటుకున్న పోలీసులు..

మానవత్వం చాటుకున్న పోలీసులు..

నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాలపేటలో నరాల బలహీనతో బాధపడుతున్న ఓ మహిళకు పోలీసులు ఆర్థిక సహాయం చేసి గొప్పి మనసును చాటుకున్నారు. గోపాల్ పేటకు చెందిన మాథమాల దుర్గమ్మ.. వయస్సు 66 సంవత్సరాలు. ఆమె నరాల బలహీనతతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే ఎల్లారెడ్డి సీఐ శ్రీ రాజారెడ్డి, నాగిరెడ్డి పేట్ ఎస్‌ఐ శ్రీ భార్గవ్ ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సీఐ రాజారెడ్డి, నాగిరెడ్డి పేట్ పోలీస్ సిబ్బంది కలిసి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ. 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేసారు.

Leave a Reply