గుట్టును పట్టారిలా..

శ్రీ సత్యసాయి బ్యూరో, (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కదిరి డీఎస్పీ జే. శివ నారాయణస్వామి, రూరల్ అప్‌గ్రేడ్ సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై సుమతి శుక్రవారం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు.

కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను అధికారులు వెల్లడించారు. పక్కా స‌మాచారం ఆధారంగా కదిరి రూరల్ పరిధిలోని కొండమ నాయుడు పాలెం గ్రామం సమీపంలో, సచివాలయం వెనుక గుట్టలో గంజాయి నిల్వలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

గురువారం రాత్రి పోలీసులు ఆ ఘటనాస్థలంపై దాడి చేసి ముఠా సభ్యులను పట్టుకున్నారు. అరెస్టైన వ్యక్తులలో ఆజాద్ (కదిరి టౌన్), నల్లమాడ సోయాబ్, నాగరాజు వీధి (కదిరి టౌన్), షేక్ ఆర్ఫన్ (గాంధీ నగర్, కదిరి టౌన్), షేక్ మహమ్మద్ హుస్సేన్ (జామియా మసీదు, కదిరి టౌన్), షేక్ అస్లాం (అమీర్ నగర్, కదిరి టౌన్), ఎస్ గౌస్ బాషా (ఖాజా నగర్, కదిరి టౌన్) ఉన్నారు

ఈ సందర్భంగా పోలీసులు ఆ ముఠా వద్ద నుంచి మొత్తం 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి రెండు కిలోలు, ఒకటిన్నర కిలోలు చొప్పున బ్యాగులలో గంజాయి ఉన్నట్లు తాము గుర్తించామని తెలిపారు. అదేవిధంగా, ఐదు సెల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోందన్నారు.

Leave a Reply