Police | మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ

Police | మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ
- కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ
Police | తొర్రూరు, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని లక్ష్యంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జోరుగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే సుమారు 150 మందికి పైగా పోలీసులు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఈ పరిమణాల నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు జోరందుకుంది.
మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 వార్డులు ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తొమ్మిది వార్డులలో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ ఏడు వార్డులలో గెలిచింది. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి, ఎంపీ కడియం కావ్య ల ఎక్స్ అఫీషియో ఓట్లు కాంగ్రెస్ కు బలం పెరిగింది.

ఈ నేపథ్యంలో క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లను మాజీ మంత్రి దయాకర్ రావు బస్సులో తొర్రూరు మున్సిపాలిటీకి చేరుకున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విమిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి చేరుకున్నారు. ఎంపీ కడియం కావ్య ఇదివరకే వరంగల్ పాలక సంస్థలో ఎక్స్ అఫీషియో నెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిందని బిఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరువురు పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
