Phone Tapping Case | కస్టోడియల్ విచారణ నుంచి..

Phone Tapping Case | కస్టోడియల్ విచారణ నుంచి..

ప్రభాకర్ రావు విడుదల


Phone Tapping Case | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ప్రధాన నిందితుడు, మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణ నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలోనే ఆయనకు సిట్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి ఇవాళ తెల్లవారుజామున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు.

జనవరి 16న ఈ కేసుకు సంబంధించి నివేదికను సిట్, సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు డిసెంబర్ 19న ఆయన కస్టడీని నిన్నటి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు డిసెంబర్ 12న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన ప్రభాకర్ రావును 14 రోజుల పాటు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (SIT) సుదీర్ఘంగా విచారించింది.

ఇక విచారణలో భాగంగా చివరి రోజు కేసులో సహ నిందితులైన ప్రణీత్ రావు, భుజంగ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలను సిట్‌ జూబ్లీహిల్స్ పీఎస్ (Jubilee Hills PS) కు పిలిపించి ఒక్కొక్కరుగా ప్రశ్నలు సంధించి కీలక సమాచారాన్ని రాబట్టారు.

Leave a Reply