PGRS | పరిష్కార వేదికకు 241 అర్జీలు

PGRS | పరిష్కార వేదికకు 241 అర్జీలు
PGRS | తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇవాళ ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు.
గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందిస్తూ వారి సమస్యలను సావధానంగా విన్నారు. అర్జీలను నిర్లక్ష్యం చేయరాదని, అర్జీదారులు సంతృప్తి చెందేలా స్పష్టమైన పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్ లైన్ లో నమోదు చేసి రసీదులు అందజేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్‌రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్‌మాండ్‌లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. శాఖల వారీగా రెవెన్యూ శాఖకు 146, పంచాయతీరాజ్ 25, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం 9, జల వనరుల శాఖ 5, హోం శాఖ 13, రిజిస్ట్రేషన్ శాఖ 1, సర్వే శాఖ 6, సివిల్ సప్లైస్ 1, ఫ్యామిలీ వెల్ఫేర్ 5, హౌసింగ్ 4, విద్యుత్ శాఖకు 4, పాఠశాల విద్యాశాఖ 2, సమగ్ర శిక్షకు 1, గ్రామ – వార్డు సచివాలయానికి 1, ఎండోమెంట్స్‌కు 2, ఏపీఎస్‌ఆర్టీసీకి 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 2, గనులు – భూగర్భ వనరుల శాఖకు 2, వికలాంగుల సంక్షేమ శాఖ 2, పశుసంవర్ధక శాఖ 2, రవాణా శాఖ 1, డీఆర్‌డీఏ 1 అర్జీ చొప్పున మొత్తం 241 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.
