ఒకరోజు ముందే పింఛన్ల పండగ..

మోపిదేవి, ఆంధ్రప్రభ : మార్చి 1వ తేదీ ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28వ తేదీ రోజే అంటే శనివారం ఒకరోజు ముందే పింఛన్ల పండుగ వచ్చింది. ఎన్టీఆర్ పింఛన్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 4 వేలు ఇచ్చి పేదల సంక్షేమానికి కృషి చేస్తుంది. మోపిదేవి, కొక్కిలిగడ్డ, బొబ్బర్లంక గ్రామాల్లో తెల్లవారుజామునే పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి రత్నగిరి, గ్రామ పార్టీ అధ్యక్షులు చందన రంగారావు, కేసాని శివుడు, దొప్పలపూడి జగదీష్, సర్పంచ్ దిడ్ల రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు దిడ్ల రాణి, క్లస్టర్ ఇంచార్జ్ కొలుసు శివ రాజేష్, యూనిట్ ఇంచార్జ్ గొరిపర్తి సత్యనారాయణ, పార్టీ నాయకులు కోనేరు చంద్రమౌళి, శ్రీను, బూత్ కన్వీనర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
