పెన్షన్ దారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

పెన్షన్ దారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

  • రిటైర్డ్ హెచ్ఎం రావుల భాస్కర్ రావు

రాయపర్తి, ఆంధ్రప్రభ : పెన్షన్ దారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రిటైర్డ్ హెచ్ఎం రావుల భాస్కర్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయంలో రాయపర్తి మండల పెన్షన్ దారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎండి ఉస్మాన్ ఖాన్,రావుల భాస్కరరావు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెన్షన్ దారుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ తహసిల్దార్ కార్యాలయంలోని ఇంచార్జ్ రెవెన్యూ అధికారి చంద్రమోహన్ కి మెమోరాండం సమర్పించారు.

అనంతరం పెన్షన్ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కదా వైవి చంద్ర చూట్ పదవి విరమణ పొందిన ప్రతి ఉద్యోగికి పెన్షన్ అనేది ఒక హక్కు అని ప్రైస్ ఇండెక్స్ ధరల సూచికను బట్టి డిఏలు మంజూరు చేయాలని తెలిపారు. విరమణ పొందిన ఉద్యోగులకు ఒక హక్కుగా పరిగణించాలని, గతంలో తీర్పు ఇవ్వడం జరిగిందిఅన్నారు .

ఉద్యోగ సంఘాలకు ప్రతినిధులకు తెలియకుండానే పార్లమెంటులో పెన్షనర్ల యొక్క ఆర్థిక అవసరాలను తమ నియంత్రణలో తేవడానికి ఒక చట్టం తయారు చేయడం విచారకరమని, దీన్ని న్యాయంగానే ఎదుర్కొంటామని కోర్టులోనే తేల్చుకుంటామని, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ బిల్లు పెన్షన్ దారులకు ఒక సంఘటన మారకుండా చూడాలని ప్రధానమంత్రి మోడీ గారిని సంఘ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఆకుల నరేందర్ రావు, జిల్లా నాయకులు అబ్బోజు రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply