ఈరోజు పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు రాణించారు. మల్లన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్.. ఆర్సీబీ స్పిన్నర్ల ఉచ్చులో పడింది. పంజాబ్ ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ, కీలక బ్యాట్స్‌మెన్లందరూ స్పల్ప పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. ఫలితంగా, పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (15 బంతుల్లో 22), ప్రభసిమ్రాన్ సింగ్ (17 బంతుల్లో 33) పవర్ ప్లేలో దంచికొట్టారు. 4.2 వ ఓవర్లో కృణాల్ పాండ్య బౌలింగ్ లో బౌండరీలతో చెలరేగిన ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య క్యాచ్ ఔటయ్యాడు.
పవర్ ప్లే అనంతరం మరో ఓపెనర్ కూడా కృణాల్ పాండ్య బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. దాంతో 62 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది పంజాబ్. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ (6), నేహల్ వధేర (5) ఔటయ్యారు. ఇక శశాంక్ సింగ్ తో కలిసి ఇన్నింగ్ నిబెట్టే ప్రయత్న చేసిన జోస్ ఇంగ్లిస్ (29)ని సుయాష్ శర్మ క్లీన్ 13.2 ఓవర్లో బౌల్ట్ చేశాడు. అదే ఓవర్లో 13.5 బంతి మార్కస్ స్టోనిస్ (1) ఔటయ్యాడు. దీంతో 114 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది పంజాబ్. ఇక ఆ తరువాత వచ్చిన మార్కో జాన్సన్ (25) తో కలిసి శశాంక్ సింగ్ (31) 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
దాంతో పంజాబ్ స్కోర్ 157కు చేరింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ రెండు వికెట్లు తీయగా.. రొమారియో షెపర్డ్ ఓ వికెట్ పడగొట్టాడు. దీంతో 158 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ ఛేజింగ్ కు దిగనుంది.
ఆర్సీబీ ఔలర్లు పుంజుకుని కట్టుదిట్టం చేయడంతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది.