23న సింగరేణి కార్మికులకు చెల్లింపులు
( కాసిపేట, ఆంధ్రప్రభ) : సింగరేణి బొగ్గు గని(Singareni Coal Mine) కార్మికులకు ఈ నెల 23న దసరా పండుగ నేపథ్యంలో అడ్వాన్స్ రూపేణా(Advance Rupena) నగదు ను అందించుటకు యాజమాన్యం శనివారం ఆదేశాలు జారి చేసింది. సంస్థలోని హిందూ ఉద్యోగుల(Employees) వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది.
కంపెనీ పర్మినెంట్ ఉద్యోగులకు(Permanent Employees) రూ,25 వేలు, బదిలీ కార్మికులు, ఏడాది లో 190 డ్యూటీలు(190 Duties) చేయని కార్మికులకు రూ, 12 500లు అడ్వాన్స్ గా చెల్లిస్తుంది. నిబంధనల మేరకు ఈ మొత్తాన్ని కార్మికుని వేతనాల(Wages of Worker) నుండి పది నెలలు సమానంగా రికవరీ చేస్తారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు(Trade Unions), కార్మికులు డిమాండ్(Demand) చేస్తున్నలాభాల్లో వాటా శాతం పై యాజమాన్యం స్పష్టత ఇవ్వకపోవడంతో కార్మికులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.