అమెరికాలో నేడు జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి మృతిచెందాడు. మృతుడిని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన ప్రవీణ్ (27)గా గుర్తించారు. గంప రాఘవులు, గంప రమాదేవీల కుమారుడైన ప్రవీణ్ గతేడాది ఎంఎస్ చేయడానికి అమెరికాలోని మిల్వాంకి విస్కాన్సిన్ సిటీకి వెళ్లాడు. అక్కడ ఎంఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న అతడు.. స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. అయితే, అతడు నివాసం ఉండే ఇంటి సమీపంలో కాల్పులు చోటుచేసుకోగా వాటిలో ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Gun Fire | అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
