ponnam | పెండింగ్ వేత‌నాలు చెల్లించండి

ponnam | పెండింగ్ వేత‌నాలు చెల్లించండి

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌కు విన‌తి

ఉట్నూర్, మార్చి 28 (ఆంధ్రప్రభ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు శనివారం హైదరాబాదులోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేబీసీ నారాయణ తెలిపారు. సంఘ నాయకులతో కలిసి గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల దినసరి ఉద్యోగుల పారిశుద్ధ్య కార్మికుల కు సంబంధించిన ఏడు నెలల పెండింగ్ వేతనాలు ఉన్నాయని, వెంట‌నే నిధులు విడుదల చేయాల‌ని మంత్రికి వినతిపత్రం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లిస్తున్నట్లు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

మంత్రిని కలిసిన వారిలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి భుఖ్య వాల్ సీమ, ఆదిలాబాద్ జిల్లా సంఘ అధ్యక్షులు సౌకత్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా సంఘం అధ్యక్షులు దిలీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి స్వాతి, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు రామచందర్, ప్రధాన కార్యదర్శి పోచం, నిర్మల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజలింగు, వసంత్, సంఘ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply