తిరుమల : టీటీడీకి చెందిన ఎస్వీ అన్నదానం, ఎస్వీ ప్రాణదానం, ఎస్వీ విద్యాదానం విభాగాలకు మంగళవారం రూ.1.23 కోట్లు విరాళం అందింది. కర్నాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన శ్రీనివాస కన్ స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఈ మేరకు డీడీలను తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
విరాళం వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.1,01,11,111 విరాళాన్ని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు, రూ.11,11,111 విరాళాన్ని ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు, రూ.11,11,111 విరాళాన్ని ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ కు సదరు సంస్థ ప్రతినిధులు డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అభినందించి సత్కరించారు.