ఇంకెన్నాళ్లు ఈ ఇబ్బందులు

ఇంకెన్నాళ్లు ఈ ఇబ్బందులు

  • తెగిపోయిన డ్రైవర్షన్ రోడ్డు
  • పట్టించుకోని కాంట్రాక్టర్
  • 15 రోజులుగా ప్రయాణికుల అవస్థలు

రాజాపేట, ఆంధ్రప్రభ : రాజాపేటకు వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు..నానాటికి ఇబ్బందులు పడుతూ అరిగోస పడుతున్నారు.. మండలంలోని పొట్టిమర్రి వాగులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు తెగిపోవడంతో గత 15 రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజాపేట మండలంలోని పొట్టిమర్రి వాగులో బ్రిడ్జి నిర్మాణం లో భాగంగా ప్రయాణికుల కోసం తాత్కాలికంగా డైవర్షన్ రోడ్ ఏర్పాటు చేశారు.

కాగా.. ఇటీవలే గంధమల్ల చెరువు నుంచి కాలేశ్వరం జలాలు విడుదల చేయడంతో వరద ఉధృతికి డైవర్షన్ రోడ్డు తెగిపోయింది. దాంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాజాపేట నుంచి యాదగిరిగుట్ట కి వెళ్లే ప్రయాణికులు అదనంగా 15 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

తెగిపోయిన డైవర్షన్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టడంలో కాంట్రాక్టర్ ఇటు పాలకులు పట్టించుకోని పాపాన పోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో యాదగిరిగుట్ట నుంచి రాజాపేటకు వచ్చే కొన్ని బస్సులను సైతం నిలిపివేశారు. దాంతో ప్రయాణికులు అప్పుడప్పుడు వచ్చే బస్సులో కిక్కిరిసి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే డైవర్షన్ రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రయాణికులు ఇబ్బందులు తొలగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply