పేరెంట్స్ మీటింగ్‌కు రావాల‌ని ఆహ్వానం

మల్యాల, ఆంధ్ర‌ప్ర‌భ : జగిత్యాల జిల్లా (Jagtial District) మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల (Malayala Government Junior College) అధ్యాపకులు వినూత్న ఆలోచ‌న చేశారు. శుక్ర‌వారం మా కళాశాలలో జరిగే స్టూడెంట్స్ పేరెంట్స్ సమావేశానికి తప్పనిసరిగా రావాలని మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు రచన, అనూష లు సంప్రదాయబద్ధంగా ఇళ్లకు వెళ్లి విద్యార్థులు (Students) తల్లిదండ్రులకు బొట్టు పెట్టి ఆహ్వానించారు.

కళాశాల ప్రారంభమై మూడు నెలలు గడుస్తుండగా ఈనెల 28వ తేదీ నుంచి కళాశాలకు దసరా సెలవులు (Dussehra Holidays) ప్రభుత్వం ప్రకటించడంతో కళాశాల ప్రిన్సిపల్ (College Principal) స్టూడెంట్స్ పేరెంట్స్ సమావేశాన్ని (Parents Meeting) కళాశాలలో ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఏర్పాటు చేసిన సమావేశాలకు రావడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపించకపోవడంతో కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు రచన, అనూష లు మన సంప్రదాయాన్ని అనుసరించి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు బొట్టుపెట్టి కళాశాలలో నిర్వహించే స్టూడెంట్స్ పేరెంట్స్ సమావేశానికి హాజరు కావలసిందిగా ఆహ్వానించారు.

అయితే విద్యార్థుల ఇళ్లకు వెళ్లే గ్రామంలో గురువారం వర్షం ఆటంకంగా మారడంతో దారిలో ఓ దుకాణం వద్ద రెయిన్ కోట్లు కొనుగోలు చేసి విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి వెళ్లి మరి ఆహ్వానించారు. అయితే ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు చదువు పట్ల ఆసక్తి చూపించకపోవడంతో పాటు విద్యార్థులు కళాశాలకు రాకపోయినప్పటికీ ఆ విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించినప్పటికీ తల్లిదండ్రులు స్పందించకపోవడం వల్ల విద్యార్థులను ఎలాగైనా కళాశాలకు తప్పించాలని ఉద్దేశంతో అధ్యాపకులు రచన, అనూష లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను బొట్టు పెట్టి మరి కళాశాల స్టూడెంట్స్ పేరెంట్స్ సమావేశానికి ఆహ్వానించినట్లు విద్యార్థులు భావిస్తున్నారు.

Leave a Reply