Pamidi | లారీ ఢీకొని… వ్యక్తి మృతి

Pamidi | లారీ ఢీకొని… వ్యక్తి మృతి

Pamidi | పామిడి, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లా పామిడి మండల పరిధిలోని జాతీయ రహదారి–44పై అయ్యప్ప స్వామి దేవాలయం ఎదుట ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ ఒక వ్యక్తిని ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడిని పామిడికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply