కొండవీడులో పల్నాడు కలెక్టర్ తన్మయం
పల్నాడు బ్యూర్, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కోట(Kondaveedu Fort) ప్రాంతాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల(Kritika Shukla) ఈ రోజు సందర్శించారు. ఘాట్ రోడ్డుతో పాటు కొండపై ఉన్న చెరువులను పరిశీలించారు. విధుల చెరువులో బోటింగ్(Boating) నిర్వహించారు.
ఈ సందర్బంగా కొండవీడు కోటను సందర్సించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ ప్రియ మొక్కలు అందించి స్వాగతం పలికారు. కలెక్టర్ పర్యాటక అభివృద్ధి గురించి కొన్ని సూచనలు చేసారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కొండవీడు ప్రాంతం ఎంతో చారిత్రకమైనదని దానిని పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయాలో ఒక ఆలోచన వచ్చేందుకు తాను వివిధ శాఖల అధికారుల(Officials)తో కలిసి సందర్శించినట్లు వెల్లడించారు.



